![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -57 లో.. దీప టిఫిన్ వడ్డీస్తుంటే.. అప్పుడే శౌర్య వచ్చి నాకు స్కూల్ కి లేట్ అవుతుంది. లేట్ గా వెళ్తే పనిష్మెంట్ ఇస్తారని శౌర్య అనగానే.. ఎవరికి అని పారిజాతం అంటుంది. మా అమ్మకి అని శౌర్య చెప్తుంది. చూసావా దీప.. నీ కూతురు నీపై ఎంత కేర్ తీసుకుంటుందోనని సుమిత్ర అంటుంది. ఆ తర్వాత శౌర్యని దీప తీసుకొని బయటకు వెళ్తుంది. అక్కడ బయటున్న శ్రీధర్ ని చూసి.. శౌర్యని పంపించి శ్రీధర్ దగ్గరికి దీప వెళ్తుంది.
దీపని చూసి కంగారుగా లోపల నన్ను పిలుస్తున్నారా అని శ్రీధర్ అంటాడు. మీ విషయం తెలిసి పిలిచే రోజు దగ్గరలోనే ఉంది. కాంచనగారు నాలాగా కాకూడదు మిమ్మల్ని చాలా నమ్ముతుంది.. తనకి అన్యాయం చెయ్యకండి.. నేను నిజం ఎవరికి చెప్పాను కానీ మీరు ఈ తప్పుని సరిదిద్దుకోండి అని శ్రీధర్ కి దీప చెప్పి వెళ్తుంది. దీపతో నాకు ప్రాబ్లమ్ అయ్యేలా ఉందని శ్రీధర్ అనుకుంటాడు. మరొకవైపు దీపకి కడియం థాంక్స్ చెప్తాడు. నీవల్లే నా ప్రాబ్లమ్ క్లియర్ అయింది. ఇదిగో నీ జీతం డబ్బులు అని దీపకి ఇస్తాడు. ఇంకా నెల అవ్వలేదు కదా ఇప్పుడే ఎందుకు ఇస్తున్నారని దీప అడుగుతుంది. నీకు అవసరాలు ఉంటాయి కదా అని కడియం అంటాడు. సరే నేను శౌర్యకి టిఫిన్ ఇచ్చేసి వస్తానని దీప వెళ్తుంది. మరొకవైపు ఇంకా టిఫిన్ తీసుకొని రావడం లేదని శౌర్య వెయిట్ చేస్తుంటుంది. అప్పుడే స్కూల్ కి క్యాబ్ నడుపుతూ నరసింహ వస్తాడు. అక్కడ శౌర్యని చూసి.. నేనే మీ నాన్నని అని చెప్తానని శౌర్యని నరసింహ పిలుస్తాడు. ఆమ్మో బూచోడు అంటు శౌర్య లోపలికి వెళ్లి దాక్కుంటుంది. నరసింహ కూడా శౌర్య కోసం వెతుక్కుంటూ వెళ్తాడు.
ఆ తర్వాత శౌర్యని నర్సింహ చూస్తాడు. దాంతో శౌర్య పరిగెడుతుంది. అప్పుడే దీప వస్తుంది. భయపడుతున్న శౌర్యని చూసి.. ఏం భయపడకని చెప్తుంది. అమ్మా బూచోడని శౌర్య అంటుంది. శౌర్యని దీప లోపలికి పంపిస్తుంది. ఎందుకు మా జోలికి వస్తున్నావని నరసింహని దీప అడుగుతుంది. నేనే మీ నాన్న అని చెప్తానంటూ బెదిరిస్తాడు. నీకు టార్చర్ చూపిస్తానని అంటాడు. మరొకవైపు సుమిత్ర కాఫీ తీసుకొని శ్రీధర్ కి ఇస్తుంది. వద్దు కావేరి అని శ్రీధర్ అనగానే.. ఏంటి కావేరి ఎవరని అడుగుతుంది. శ్రీధర్ ఏదో కవర్ చేస్తాడు. నేను వెళ్తున్నానంటూ వెళ్ళబోతుంటే.. దీప భర్త రెండో పెళ్లి గురించి మాట్లాడండి అని పారిజాతం అంటుంది. మనకు ఎందుకని శ్రీధర్ అంటాడు. భార్య ఉండగా మరొక పెళ్లి చేసుకోవడం తప్పు కదా అని పారిజాతం అంటుంది. ఈవిడ మళ్ళీ మొదలు పెట్టిందని శ్రీధర్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |